![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ హాట్ క్యూటీ అష్షు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాలా...ఆమె గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. అలాంటి అష్షు ఇప్పుడు పేరు మార్చుకుంది. పేరు మార్పు అంటే పూర్తి పేరు మార్చేసుకుంది అనుకునేరు. కాదండి ఒక లెటర్ ఎక్స్ట్రా చేర్చుకుందన్న మాట. అసలే అమ్మడుకు జాతకాలు, న్యూమరాలజీ ఇవన్నీ అంటే పిచ్చి. ఐనా కొంతకాలం నుంచి అష్షు లైమ్ లైట్ లో సరిగా కనిపించట్లేదు. తనకు టైం కలిసి రావడం లేదు అని చాలా ఫీలవుతోంది. దాంతో ఆమె వేణు స్వామిని కూడా సంప్రదించి పూజలు గట్రా చేయించడంతో పాటు ఆశీర్వాదాలు కూడా తీసుకుంది. ఇక న్యూమరాలజీ ప్రకారం అష్షు రెడ్డి పేరును కాస్తా ఆషురెడ్డిగా మార్చుకుంది. తన పేరులో కొత్తగా మరో A అక్షరాన్ని యాడ్ చేసింది.
సరే ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే టైం అనేది ఒకటి ఉంటుంది..జీవితంలో ఎత్తుపల్లాలు కామన్..బాగున్న రోజున నవ్వుకుని బాలేని రోజున న్యూమరాలజీ, ప్రకారం పేరు మార్చుకుంటే ఉపయోగం లేదు. ఒక బాడ్ టైం నడుస్తోంది అంటే గుడ్ టైం ఏదో రాబోతోంది అని తెలుసుకోవాలి. కానీ సెలబ్రిటీస్ ఇవేమీ పట్టించుకోరు. అడుగు పెట్టగానే అదృష్టం కలిసి రావాలంటే కుదరదు కదా.. పాత సీసాలో కొత్త వైన్ లా ఎప్పుడూ నిరాశపడకుండా కొత్తకొత్తగా ఏదో ఒకటి ట్రై చేస్తూ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉండాలి..అప్పుడే అవకాశాలు వస్తాయి... ఏదేమైనా ఆషు రెడ్డి ఇప్పుడు "యేవం" అనే మూవీ చేస్తోంది. అలాగే "ఏ మాస్టర్ పీస్" అనే మూవీ చేసింది. చూడాలి పేరు మార్పు ఎంత వరకు సక్సెస్ ని ఇస్తుందో.
![]() |
![]() |